Categories: FeaturedMovie News

Singer KK : సింగర్ కేకే మృతి పై అనుమానాలు.. వైరల్ అవుతున్న చివరి కన్సర్ట్ వీడియో..!

Singer KK : కృష్ణకుమార్ కున్నాత్ విరహ గీతాల స్పెషలిస్ట్, ఎవరు ఈ సింగర్ అనుకుంటున్నారా ఎవరో కాదు కేకే. చెలియా చెలియా అంటూ వెంకటేష్ ఘర్షణలో పాడినా, చెలియా చెలియా అంటూ రామ్ చరణ్ ఎవడు లో పాడినా ఆ విరహ గీతాల వెనుక ఉన్న గాత్రమా మాత్రం కేకే దే. ఎక్కువగా ఎవరు ఆయన్ను చూసుండరు, పలానా పాట అతనే పాడదని తెలిసుండదు కానీ కేకే మాత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ , అస్సామి, బెంగాలీ, గుజరాతి భాషలలో కలిపి 800 పైగా పాటలను పాడాడు. ఆ గాత్రం మనల్ని వీడి పోయింది. మంగళవారం రాత్రి కలకత్తా ప్రదర్శన తరువాత గుండెపోటుతో మరణించారనే వార్త ఒక్కసారిగా సంగీతం ప్రియులను షాక్ కి గురి చేసింది.

ఎన్నో అనుమానాలు…అసలు జరిగింది ఏమిటి….

అసలు కే కే మృతికి నిజంగా గుండెపోటే కారణమా అనే అనుమానాలు ఇప్పుడు బయలుదేరాయి. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకోవడం ఈ అనుమానలకు మరింత బలాన్నిచ్చింది. ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న చివరి కన్సర్ట్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కేకే ఆ ప్రదర్శనలో ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుస్తోంది. యాజమాన్యం సరిగా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల చాలా మంది జనం ఉన్నా ఆడిటోరియంలో ఏసీ లేకపోవడం కనీసం ఫ్యాన్ కూడా లేకపోవడంతో ఇబ్బందికి లోనయ్యారు.

కోల్‌కతా నజ్రుల్‌ మంచాలోని గురుదాస్‌ కాలేజ్‌ వద్ద జరిగిన కాన్సెర్ట్‌లో పాల్గొన్న కేకే అంత జనంలో గాలి ఆడక పోవడంతో చెమటలు పట్టి తట్టుకోలేక యాజమాన్యంకి స్వయంగా తన అవస్థను చెప్పినా సరిగా స్పందించకపోవడంతో కన్సర్ట్ ముగిసాకా హోటల్ ఒబెరాయ్ కి వెళ్లి ఛాతిలో భారంగా ఉందని సిబ్బందికి చెప్పారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఆయన అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని సీఎంఆర్‌ఐ ఆస్పత్రిలో ఉంచారు. పోస్ట్‌ మార్టం పూర్తి అయితేనే ఆయన మృతికి గల అసలు కారణం తెలుస్తుంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago