Sadaa : తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయింది సదా. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ, దొంగ దొంగది, ఔనన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలలో నటించిన సదా, తరువాత శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ‘అపరిచితుడు’ సినిమాలో నటించింది. ఈ సినిమా సదా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా సదా నటించింది. తాజాగా ఒక ఇంటిర్వ్యూలో పాల్గొన్న సదా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆ విషయంలో డైరెక్టర్ శంకర్ సీరియస్ అయ్యాడు…
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా.. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అపరిచితుడు సినిమా గురించి, సెట్లో విక్రమ్ కు తనకు మధ్య జరిగిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆన్ స్క్రీన్ లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉందని సెట్ లో అందరు కాంప్లిమెంట్ ఇచ్చేవారు. కానీ విక్రమ్ మాత్రం నన్ను చెల్లి అని పిలిచేవారు. అయితే ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్ లో నటించేటప్పుడు డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే సీన్ చేసే వాళ్ళం, సీన్ అయిపోయి డైరెక్టర్ కట్ చెప్పగానే విక్రమ్ నన్ను సిస్టర్ అని పిలిచేవారు. అలా అనగానే అందరం నవ్వుకునే వాళ్ళం. అలా విక్రమ్ నన్ను చెల్లి అని పిలవడంతో నేను కూడా ఆయనను అన్నయ్య అని పిలిచే దాన్ని. అయితే ఈ విషయమై డైరెక్టర్ శంకర్ కు తెలిసి చాలా సీరియస్ అయ్యాడు.
సినిమాలో హీరో హీరోయిన్ అంటే అందరు లవర్స్ అనే భావనలో మాత్రమే చూస్తారు. మీరు ఇలా అన్నా చెల్లి అని పిలుచుకుంటారని ప్రేక్షకులకు తెలిస్తే సినిమా మొత్తం నాశనం అవుతుంది. సినిమా విడుదల అయ్యాక తెరపై మిమ్మల్ని ఆ దృష్టితో అభిమానులు చూడలేరని దర్శకుడు అన్నారు అని సదా చెప్పుకొచ్చింది. అయితే అపరిచితుడు సినిమా తరువాత సదాకు విజయాలు పెద్దగా రాలేదు. కొన్ని కారణాల వలన సదా తొందరగానే ఫేడ్ అవుట్ అయిపోయింది. కాకపోతే సదా ఇపుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అనుకుంటోందట. సపోర్టింగ్ క్యారెక్టర్లు, సీనియర్ హీరోల పక్కన చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…