Actress Hansika:అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ హన్సిక ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దకాలం పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ ఈమెకు ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. దేశ ముదురు సినిమా తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించిన హన్సిక తెలుగులో గుర్తింపు పొందకపోయినప్పటికీ తమిళంలో మాత్రం అగ్రతారగా ఓ వెలుగు వెలిగింది.
ఇప్పటికీ ఈమె తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతూ బిజీగా ఉన్నారు. ఇకపోతే హన్సిక గతంలో పలువురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నట్టు పెద్ద ఎత్తున ఈమె ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా హన్సిక గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని కోలీవుడ్ కోడైకూస్తుంది.
అయితే ఈమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా కొత్త వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.బాగా పేరు పలుకుబడి ఉన్నటువంటి ఒక పొలిటిషియన్ కుటుంబానికి హన్సిక పెద్ద కోడలు కాబోతుందని సమాచారం. ఇప్పటికే ఈమె పెళ్లి గురించి ఇది కుటుంబ సభ్యులు మాటలు కూడా అయిపోయాయని త్వరలోనే వీరి నిశ్చితార్థం గురించి అధికారక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
మరి హన్సిక పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమె పెళ్లి గురించి క్లారిటీ రావాలంటే ఈ విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది. ఇలా ఈమె గురించి పెళ్లి వార్తలు రావడంతో పలువురు ఈమె పెళ్లి పై స్పందిస్తూ హన్సిక ప్రేమ పేరుతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచినప్పటికీ మొత్తానికి బాగా బ్యాక్గ్రౌండ్ ఉండ ఫ్యామిలీలోకి కోడలుగా వెళుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…