Sadaa : ఏదైనా సినిమా అవకాశం వదులుకున్న హీరోల గురించి చాలా విని ఉంటాము కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకున్న హీరోయిన్ల గురించి పెద్దగా విని ఉండము. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరిపోయింది సదా. ప్రస్తుతం సదా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కొన్ని బుల్లితెర ప్రోగ్రాములలో కూడా కనిపిస్తోంది. అయితే సదా మెగా స్టార్ సినిమాలో అవకాశాన్ని వదులుకుంది అని సమాచారం.
పెద్ద స్టార్ సినిమాలో ఇలా చేస్తే మిగతా హీరోలు కూడా నన్ను అలానే చూస్తారు…
సదా… మొదటి సినిమా ‘జయం’ తోనే మంచి విజయాన్ని తన ఖాతాళి వేసుకుంది. ఇప్పటికి సదా అంటేనే ‘వెళ్ళవయ్యా వెళ్ళు.. వెళ్ళు…’ అనే డైలాగ్ అందరికీ గుర్తొస్తుంది. ‘అపరిచితుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నా రాంగ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం వలన కెరీర్ ఆగిపోయింది. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది సదా. సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా రాణించాలి అని తపన పడుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ‘భోళాశాంకర్’ సినిమాలో ఒక అవకాశాన్ని వదులుకుంది.
వివరాల్లోకి వెళితే ‘భోళాశంకర్’ సినిమాలో సదాను ఓ చిన్న పాత్ర కోసం సంప్రదించారట మేకర్స్. ఒక ఐటమ్ సాంగ్ చేసి ఆ తర్వాత ఒక పది నిమిషాల కామెడీ క్యారెక్టర్ కి ఆమెకు ఆఫర్ వచ్చిందట. అయితే సదా మెగాస్టార్ సినిమా అయినప్పటికీ ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడలేదు. “ఇప్పుడు పెద్ద స్టార్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే మిగతా స్టార్స్ కూడా తనను ఐటమ్ సాంగ్స్ కోసమే సంప్రదిస్తారు” అంటూ ఆఫర్ ను వద్దనుకుందట. అయితే తరువాత ఈ ఆఫర్ శ్రీముఖి చేతికి వెళ్లినట్టు సమాచారం.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…