Lasya : తెలుగు బుల్లితెర మీద యాంకర్ గా అభిమానులకు దగ్గర అయిన లాస్య, బిగ్ బాస్ హౌస్ కి కంటెస్టెంట్ గా వెళ్లి అందరికీ మరింత చేరువ అయ్యింది. ఒక వైపు యాంకర్ గా రాణిస్తూనే కొన్ని సినిమాలలో కూడా నటించింది. అయితే మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా వెళ్లి, దాని నుండి వచ్చిన క్రేజ్ తో తన యూట్యూబ్ ఛానెల్ కూడా బాగా క్లిక్ అయ్యింది.
అయిదేళ్ల తరువాత రెండవసారి తల్లి కాబోతున్నట్టు…
ఇటీవల లాస్యకు ఆరోగ్యం బాగోలేదని ఏవేవో కథనాలు వచ్చాయి. అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక నాకు ఏమీ కాలేదని కేవలం వైరల్ ఫీవర్ అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకుంది.
రెండోసారి తల్లి కాబోతున్నానని స్వయంగా తానే యూట్యూబ్ వీడియోలో చెబుతూ ఎమోషనల్ అయ్యింది లాస్య. మొదటగా ఇంట్లోనే టెస్ట్ చేసుకున్నాను అని, నాకు కన్ఫర్మ్ అయ్యాక ఆ తర్వాత డాక్టర్ ని కలిసి కన్ఫర్మ్ చేసుకున్నట్లు వీడియోలో తెలియజేసింది. అంతేకాకుండా తన భర్త మంజునాథ్ తో కలిసి తన మెడికల్ రిపోర్ట్స్ కూడా చూపించింది. ఇది చూసిన నెటిజన్లు అభిమానులు లాస్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతే కాకుండా లాస్య ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…