Categories: FeaturedMovie News

Rambha : ఆ హీరో అన్న మాటలకు డైరెక్టర్ తో తిట్లు తిన్న హీరోయిన్ రంభ..!

Rambha : ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయమైన రంభ అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడ లో పుట్టి పెరిగిన రంభ మలయాళం సినిమా ఆఫర్ తో అక్కడ మొదటి సినిమా చేసి ఆ తరువాత తెలుగులో ఈవివి సత్యనారాయణ గారి సినిమా తో మంచి హిట్ అందుకుని హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంది. గ్లామరస్ పాత్రలే ఎక్కువగా చేసిన రంభ ఒక హీరో చేసిన పనికి సెట్లో డైరెక్టర్ తో తిట్లు తిని ఏడ్చిందట.

జేడీ వేసిన జోక్ వల్ల ఏడ్చిన రంభ…

‘పెళ్లి సందడి’ సినిమా తరువాత కొత్త హీరో హీరోయిన్లను పెట్టి సినిమా తీయాలని రాఘవేంద్ర రావు అనుకుని సొంత బ్యానర్ లో జేడీ చక్రవర్తి హీరోగా, రంభ హీరోయిన్ గా సినిమా తీశారు. అదే ‘బొంబాయి ప్రియుడు’, ఆ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అంతే కాకుండా సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. రాఘవేంద్ర రావు సినిమా అనగానే పండ్లను, పూలను బాగా వాడుతారని తెలుసు. బొంబాయి ప్రియుడు పాట షూటింగ్ లో కూడా ఇదే జరిగింది.

ఒక పాట షూటింగ్ కోసం బత్తాయి పళ్ళను దొర్లిస్తూ ఒక షాట్ తీస్తుండగా, అప్పుడే జేడీ చక్రవర్తి ఇప్పుడు బత్తాయి పళ్ళను వేస్తున్నారు ఇంకాసేపటికి ఒక పెద్ద పుచ్చకాయ తెచ్చి నీ మీద వేస్తారు అని అనే సరికి ఫక్కున నవ్వేసిందట రంభ. ఇక హీరో హీరోయిన్లు అలా నవ్వుకుంటుంటే అసలే షాట్ కోసం కస్టపడుతున్న రాఘవేంద్ర రావు గారు కోపంతో తిట్టారట. ఇప్పుడు బాగానే నవ్వుకోండి మీరు నవ్వడం ఆపితే నేను షూటింగ్ చేస్తాను అంటూ కోపంగా అన్నారట. జేడీ వల్ల ఆనవసరంగా తిట్లు తిన్నానే అని రంభ ఏడ్చేసిందట. ఇక సెట్ లో ఉన్న వాళ్ళు సర్ది చెప్పడంతో మళ్ళీ షూటింగ్ లో పాల్గొనిందట రంభ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago