Krithi Shetty : ‘ఉప్పెన’ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి. బేబమ్మ గా తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి ఉప్పెన సినిమా క్రేజ్ తో వరుస అవకాశాలను అందుకుంది. ఒకదాని తరువాత ఒకటి వరుస సినిమాలను చేస్తూ వచ్చింది. ఉప్పెన తరువాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్, ఆ తరువాత వచ్చిన బంగార్రాజు సినిమాలు మంచి హిట్స్ అవడం తో ఇక అమ్మడు కెరీర్ టాప్ గేర్ లో ఉందని అందరూ అనుకున్నారు. ఇక చేతినిండా సినిమాలతో కృతి కూడా బిజీ అయిపోయింది.
వరుస ఫ్లాపుల వల్ల షాకింగ్ నిర్ణయం…
ఇక బేబమ్మ ఇటీవల తీసిన సినిమాల్లో నితిన్ తో చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్ పోతినేని ‘వారియర్’, సుధీర్ బాబు ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు వరుసగా విడుదలై ఫ్లాపులు అయ్యాయి. ఇక వరుస ఫ్లాపులతో కొంచెం బాధలో ఉండటం సహజమే కానీ మరీ ఇంతలా బాధపడి సినిమాలకు విరామం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలకు కొంత విరామం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పి షాకిచ్చింది.
ఏంటి కృతి కెరీర్ అన్నాక హిట్లు ఫ్లాపులు కామన్ కదా దానికే నువ్వు సినిమాలనుండి పక్కకి పోవాలనే డెసిషన్ తీసుకుంటే ఎలా అంటూ అభిమానులు అడుగుతున్నారు. నీకు ఫ్లాపులు ఎదురవడానికి కారణం నీకు స్టోరీ సెలక్షన్ రాకపోవడమే, అది సరిచేసుకో మళ్ళీ కెరీర్ గాడిలో పడుతుంది అంటూ సలహా ఇస్తున్నారు. కానీ బేబమ్మ మాత్రం కొంత కాలం సినిమాలనుండి గ్యాప్ తీసుకుని మళ్ళీ చదువుకోవాలని అనుకుంటోందట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…