Categories: FeaturedMovie News

Nandamuri Balakrishna : నాతో హీరోయిన్ గా చేస్తావా అని అడిగిన బాలయ్య… అలా సమాధానం చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nandamuri Balakrishna : ప్రస్తుతం హీరోయిన్ కావ్య అంటే ఎవరూ గుర్తు పట్టకపోవొచ్చు. కానీ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రిలో వల్లంకి పిట్ట..’ పాటలో అమ్మాయి కావ్య అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అవును, చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి, బాలు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి కావ్య అందరి మనసులలో స్థానం సంపాదించుకుంది. తరువాత చదువు కోసం సినిమాలకు దూరం అయ్యి లా పూర్తిచేసిందట. అయితే ఇప్పుడు హీరోయిన్ గా వెండి తెర మీద కనిపించబోతోంది.

ఇలా అని తెలిసివుంటే అపుడే అగ్రిమెంట్ చేసుకునే దాన్ని…

చైల్డ్ ఆర్టిస్ట్ గా 12 సినిమాలు చేసిన కావ్య… ఇప్పుడు ‘మసుదా’ అనే సినిమాతో హీరోయిన్ గా వచ్చింది. సినిమాలలోకి రావాలని అనుకున్నప్పుడు ముందు రాఘవేంద్రరావు గారిని కలిసిందట. రెండు నెలల ముందు వచ్చి ఉంటే బాగుండేది పెళ్లి సందడి సినిమా చేస్తున్నాను అని అన్నారట. నిజంగానే కాస్త ముందు వెళ్లి ఉంటే రాఘవేంద్ర రావు డైరెక్షన్లో పరిచయం అయ్యి ఉండేదేమో. కావ్యకు అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగ చైతన్య, వంటి హీరోలతోనూ సుకుమార్ మణిరత్నం వంటి డైరెక్టర్లతోనూ చేయాలని ఉందట.

ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు బాలయ్య నా సినిమాలో హీరోయిన్ గా చేస్తావా అని అడిగేవారట సరదాగా.. అపుడు కావ్య నేను హీరోయిన్ అయ్యే సరికి మీరు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు అని చెప్పేదట. ఇలా వాళ్ళు లెజెండ్స్ లాగా ఇంకా ఫామ్ లో ఉంటారు అని తెలిసి ఉంటే అపుడే అగ్రిమెంట్ చేసుకునే దాన్ని అని నవ్వుతూ చెబుతోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago