Actress Shiva Parvathi : తెలుగు వెండితెర మీద తల్లి పాత్రలలో ఇప్పటివరకు దాదాపు 250 సినిమాలలో నటించిన శివ పార్వతి గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1991 లో రామానాయుడు నిర్మించిన పరుచూరి గోపాల కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సర్పయాగం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో శివ పార్వతి నటించగా… హీరోయిన్ తండ్రి పాత్రలో శోభన్ బాబు గారు నటించడం విశేషం. సర్పయాగం, ఒరేయ్ రిక్షా, మావి చిగురు, అన్నయ్య, సంక్రాంతి, శ్రీరామ రాజ్యం, శ్రీరామదాసు, సీమ సింహం మొదలైన సినిమాలలో నటించారు. సినిమాలలోనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ పార్వతి గారు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
అవకాశాలు లేక పిచ్చెక్కి చనిపోతున్నారు…
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ పార్వతి గారు చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు. చాలా ఏళ్ళ నుండి సినిమాలలో కనిపించట్లేదు అవకాశాలు ఎందుకు రావడం లేదు మీకు అని ప్రశ్నించగా కారణం ఏంటో నాకు కూడా తెలియట్లేదు చాలా ప్రయత్నించాను, నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ కూడా నాకోసం ప్రయత్నించారు త్వరలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా కోసం కానీ రాలేదు. మరి పాతగా అయిపోయారు అన్నారట. తల్లి పాత్రకు పాతగా అయిపోయారు అనగానే ఆయన షాక్ అయ్యారు. అదే నాతో కూడా చెప్పారు. ఇప్పుడు ఆర్టిస్తులను పెద్దగా పట్టించుకోవట్లేదు. నటుడు రంగనాథం గారు చనిపోవడానికి కూడా కారణం ఇదే. రోజు హడావిడిగా షూటింగుల కోసం కస్టపడి పనిచేసి ఉన్నట్టుండి అవకాశాలు లేక ఇంట్లో కూర్చోవాలి అంటే పిచ్చెక్కిపోతారు.
కనీస వసతులు తినడానికి తిండి ఉన్నా కూడా అవకాశాలు లేక పిచ్చెక్కి చనిపోతున్నారు చాలామంది. కనీసం బుల్లితెర మీద సీరియల్స్ లోనైనా కాస్త అవకాశాలు వస్తున్నాయి. అవి కూడా లేకపోతే నాలాంటి వారు వందమంది చనిపోయి ఉండేవారు. అప్పట్లో నూతన్ ప్రసాద్ గారికి షూటింగులో ప్రమాదం జరిగి రెండు కాళ్ళు పొతే అయనకోసమే పాత్రలు సృష్టించేవారు. ఆయనకు మనోధైర్యాన్ని ఇచ్చారు. రామానాయుడు గారు, గోపాల కృష్ణ గారు, ఈవీవీ సత్యనారాయణ వంటి వాళ్ళు ఆయన వెనుక ఉండి ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు అలాంటి వారు కనిపించట్లేదు. ప్రతి సినిమాలో ఉండాలని మేము అనుకోము, కనీసం సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలో అవకాశం వచ్చినా సంతోషిస్తారు అని చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…
తెలుగు, హిందీ సినీ ప్రేక్షకులకు విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ దేవ్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు.…