Movie News

Sai Dharam Tej: బ్రేకప్ జరిగింది.. అప్పటి నుంచి అమ్మాయిలంటే భయం… సాయిధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Sai Dharam Tej: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి ధరంతేజ్ సుప్రీమ్, విన్నర్ వంటి ఎన్నో హిట్ సినిమాలలో నటించి పేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరంతేజ్ అనారోగ్యం వల్ల చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యాడు.

ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ తిగిరి సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు వేగవంతం చేశారు. ప్రమోషన్ పనులలో భాగంగా సాయిధరమ్ తేజ్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకుంటున్నాడు. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరంతేజ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. గతంలో సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపారు

Sai Dharam Tej: అమ్మాయిలు అంటేనే భయం…

ప్రస్తుతం దృష్టి మొత్తం సినిమాల మీదే ఫోకస్ పెట్టానని తెలిపాడు. ఎవరో చెప్పారని కాకుండా నాకు నచ్చినప్పుడే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని తెలిపాడు. అంతే కాకుండా గతంలో ఒకసారి తన లవ్ బ్రెకప్ అయ్యిందని, అప్పటినుండి అమ్మాయిలు అంటే భయం వేస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మొత్తానికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదని క్లారిటీ ఇచ్చాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago