Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. మొదట హీరోగా వరుస హిట్లు అందుకున్న విజయ్ గత కొంతకాలంగా పరాజయాలు చవిచూస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ నటించిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత శివా నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో సమంతకి జోడిగా నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి విజయ్ ఒక సుదీర్ఘమైన నోట్ పోస్ట్ చేశాడు. ఈ నోట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదలకి ముందు పలువురు సెలబ్రిటీలు సమంతకి , శాకుంతలం సినిమా యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా సమంతకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేశాడు.
ఈ నోట్ లో ” సామీ.. నువ్వు అందరితో ఎంతో ప్రేమగా ఉంటావు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ సినిమాలో ప్రతి షాట్ కోసం నువ్వు బెస్ట్ అందిస్తున్నావు. కానీ ఏడాదిగా నువ్వు నీ జీవితంలో ఎంత ఫైట్ చేస్తున్నావో అందరికీ తెలియకపోవవ్చు.. కానీ వాటన్నింటినీ మర్చిపోయి నవ్వుతూ ముందడు వేస్తూనే ఉన్నావు.
ఇప్పుడు నీ శరీరం విశ్రాంతి కోసం చూస్తున్నా, పనికి బ్రేక్ అవసరం ఉందని చెబుతున్నా వినకుండా ముందుకెళ్తూనే ఉన్నావు. ఈ పరిస్థితులలో విడుదల అవుతున్న ‘శాకుంతలం’ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా.
నీ పట్టుదల, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్ అంటూ ఇంట్రెస్టింగ్ నోట్ ను విడుదల చేశారు. ఇక విజయ్ షేర్ చేసిన పోస్ట్ కి సమంత స్పందిస్తూ.. ఇలాంటి సమయంలో ఇదే నాకు కావాలి. మాటలు రావడం లేదు. థాంక్యూ మై హీరో అంటూ రిప్లై ఇచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…