Movie News

Sai Dharam Tej: మెగా మేనల్లుడు పెళ్లికి బ్రేకులు వేస్తున్న మామయ్యలు… ఆ రూమర్లకు చెక్ పడినట్లే?

Sai Dharam Tej: మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవినీ పూర్తిగా తీసుకొని ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు.

ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక విరూపాక్ష సినిమా తర్వాత తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. ఇలా ఈయన సినిమాల విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికొస్తే గత కొంతకాలంగా సాయి ధరంతేజ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈయన పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు గురించి చర్చలు జరిగిపోయాయని ఇక త్వరలోనే ముహూర్తాలు కూడా నిర్ణయించబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ తన మామయ్యల కారణంగా ఈయన పెళ్లి వాయిదా పడుతూ వస్తోందని తెలుస్తుంది. ప్రస్తుతం తన చిన్న మామయ్య డిప్యూటీ సీఎంగా ఏపీ బాధ్యతలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే చిరంజీవి కూడా విశ్వంభర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇలా తన మామయ్యలు బిజీ షెడ్యూల్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది.

అన్ని రూమర్లే..
ఇలా మెగా హీరోలు అందరూ కూడా ఫ్రీ అయిన తర్వాతనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమవుతాయని సమాచారం. ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోయిన్ తోనే ఈయన పెళ్లి జరుగుతుంది అంటూ వస్తున్న వార్తలకు సాయి ధరమ్ తేజ్ టీం స్పందిస్తూ ఈ వార్తలని పూర్తిగా అవాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బిడ్డ ఎదుగుదలకు మసాజ్ ఎంత ముఖ్యమో తెలుసా?

నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…

5 minutes ago

డ్రీమ్ హీరోకి చెల్లెలిగా నటించలేను.. ఆమని సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…

2 hours ago

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

5 hours ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

5 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

5 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

6 hours ago