మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ గురైనట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా రోడ్డు ప్రమాదానికి గురవడంతో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
ఈ విధంగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకోగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సాయి ధరమ్ తేజ్ ను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ ఛాతి భాగంలోనూ, కన్న కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ ప్రథమ చికిత్స కోసం అక్కడే దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మితిమీరిన వేగం ప్రమాదానికి కారణమని పలువురు భావించగా అసలు ప్రమాదం జరగడానికి గల కారణం ఏమిటనే విషయాలు తెలియాల్సి ఉంది.
మెగా హీరో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న విషయం తెలియడంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తను తొందరగా కోలుకోవాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స జరుగుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి అయితే ఈ విషయంపై మాదాపూర్ సి ఐ స్పందిస్తూ సాయి ధరమ్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చేరవేసినట్లు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…