Categories: FeaturedMovie News

సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ వెల్లడి.. మరో 24 గంటలు..

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి చేరారు. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.

ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ప్రమాదం సమయంలో సాయి ధరమ్ తేజ్ మద్యం సేవించలేదని తేలింది. బైకు రోడ్డు మీద స్కిడ్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో ప్రమాదానికి సంబంధించిన ఘటన రికార్డు అయింది. ఇదిలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ అభిమానులు అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

ఆసుపత్రి వద్ద అభిమానులు ఎక్కువగా వచ్చి ఆందోళన చేపడుతున్నారు. దీంతో అతడి ప్రస్తుతం ఆరోగ్య స్థితిని వైద్యులు వెల్లడించాడు. ప్రస్తుతం తేజ్ వెంటి లేటర్ మీద ఉన్నాడని వైద్యులు తెలిపారు. తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 24 గంటలు ఆయన్ని అబ్జర్వేషన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదని.. కాలుకు దెబ్బ తగిలిందని మరో వైద్యుడు తెలిపారు. కండరాలకు గాయాలతో పాటు కాలర్ బోన్ ఫ్రాక్టర్ అయినట్లు ప్రాథమిక పరీక్షల ద్వారా తేలింది. అయితే, ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వెంటిలేటర్ మీద ఉంచడం సాధారణమేనని, ఆందోళన చెందవద్దని చెప్పారు. తర్వాత హెల్త్ బులెటిన్ ను రేపు ఉదయం 9 గంటలకు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago