Movie News

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం అదే.. వైద్యలు ఏం చెబుతున్నారంటే..

శుక్రవారం రాత్రి హైదరాబాదులోని మాధాపూర్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదట ప్రమాదానికి గురైన సమయంలో అతడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అతడిని స్థానికులు మొదట గుర్తుపట్టలేదు. తర్వాత వెంటనే సాయి ధరమ్ తేజ్ గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడ నుంచి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మేనల్లుడు రోడ్డుప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో చిరంజీవి, పవన్ కల్యాణ్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు.

అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి తరలివచ్చారు. వాళ్లతో పాటు నిహారిక, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్టవ్ తేజ్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదానికి అసలు కారణం రోడ్డుపై ఉన్న ఇసుక అని తేలింది. అతడు బైక్ పై వస్తున్న క్రమంలో ఒక్క సారిగా బైక్ ముందు టైర్ అక్కడకు రాగానే స్కిడ్ అయింది. అతడు హెల్మెట్ పెట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. దాని వలన ఆయన తక్కువ గాయాలతో బయటపడగలిగారని అంటున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీల్లో వీడియో రికార్డు అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago