హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి చేరారు. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.

ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ప్రమాదం సమయంలో సాయి ధరమ్ తేజ్ మద్యం సేవించలేదని తేలింది. బైకు రోడ్డు మీద స్కిడ్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో ప్రమాదానికి సంబంధించిన ఘటన రికార్డు అయింది. ఇదిలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ అభిమానులు అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.
ఆసుపత్రి వద్ద అభిమానులు ఎక్కువగా వచ్చి ఆందోళన చేపడుతున్నారు. దీంతో అతడి ప్రస్తుతం ఆరోగ్య స్థితిని వైద్యులు వెల్లడించాడు. ప్రస్తుతం తేజ్ వెంటి లేటర్ మీద ఉన్నాడని వైద్యులు తెలిపారు. తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 24 గంటలు ఆయన్ని అబ్జర్వేషన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదని.. కాలుకు దెబ్బ తగిలిందని మరో వైద్యుడు తెలిపారు. కండరాలకు గాయాలతో పాటు కాలర్ బోన్ ఫ్రాక్టర్ అయినట్లు ప్రాథమిక పరీక్షల ద్వారా తేలింది. అయితే, ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వెంటిలేటర్ మీద ఉంచడం సాధారణమేనని, ఆందోళన చెందవద్దని చెప్పారు. తర్వాత హెల్త్ బులెటిన్ ను రేపు ఉదయం 9 గంటలకు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.
































