Sai Kiran : ‘నువ్వే కావాలి’ సినిమాలో ‘అనగనగా ఆకాశం ఉంది అకాశంలో మేఘం ఉంది’ పాటతో ఒక్కసారిగా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సాయి కిరణ్. తండ్రి రామకృష్ణ గారు మంచి సింగర్ అలాగే చిన్న నాయనమ్మ అలనాటి సింగర్ సుశీలమ్మ. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న సాయి కిరణ్ మొదట ఈటీవీలో ‘శివలీలలు’ సీరియల్ లో నటించారు. ఆ సీరియల్ తో పనిచేసిన ఉదయ్ భాస్కర్ గారి సినిమా నువ్వే కావాలి లో ఆఫర్ వచ్చింది సాయి కిరణ్ గారికి, నువ్వే కావాలి సినిమా అవకాశం రావడంతో ఆ సినిమాలో సాఫ్ట్ బాయ్ క్యారెక్టర్ లో నటించారు. ఇక వెంటనే ‘ప్రేమించు’ సినిమా కు పెద్ద బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఆఫర్ తో ఆ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు. అయితే ఆ తరువాత సరైన సినిమాలను ఎంచుకోక పోవడంవల్ల హీరోగా రానించలేక పోయిన సాయి కిరణ్ బుల్లి తెర వైపు అడుగులేశారు.
లయతో పెళ్లి అనుకున్నాక…
ప్రేమించు సినిమాతో చూడచక్కని జంటగా లయ, సాయి కిరణ్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అంటూ అప్పట్లో బాగా టాక్ వచ్చింది కూడా. ఇక దీన్ని గురించి సాయి కిరణ్ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాట నిజమే అయితే అది మేము కాదు పెద్దలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు అనుకున్నాక మేము అనుకున్నాం సరే చేసుకుంటే బాగానే ఉంటుంది అని అయితే జాతకలు కుదరలేదు ఇద్దరివి అందుకే వద్దని అనుకున్నాం. అంతకు మించి మరో కారణం లేదు.
కానీ ఆ ఆతరువాత కూడా ఇద్దరం కలిసి సినిమాలో నటించాము. అలాగే ఈటీవీలో వచ్చే ఒక చిన్న సినిమా అయిన ఇంద్రజిత్ లో కలిసి నటించాము. మా మధ్య మంచి స్నేహం ఉంది అంటూ చెప్పారు. జాతకాలను కుటుంబం లో ఎక్కువగా నమ్ముతారు. అలాగే నేను కూడా బాగా నమ్ముతాను అంటూ చెప్పారు. మొదట్లో జాతకాలు అవి అంతా ట్రాష్ అనుకునే వాడిని కానీ వాటి గురించి పూర్తి అవగాహన వచ్చాక ఒక్కో గ్రహం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిసాక అర్థమైంది జాతకం గురించి, అది గొప్ప విషయం అని అంటూ చెప్పారు. సాయి కిరణ్ గొప్ప శివ భక్తుడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…