Categories: FeaturedMovie News

Natti kumar : చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడింది ఎవరి గురించి ఆ హీరో గురించేనా? ఇద్దరి మాటల్లో వ్యత్యాసం ఏమిటి : నట్టి కుమార్

Natti Kumar : సినిమా పరిశ్రమలో కొత్త కథలు రావాలి, డైరెక్టర్లు కాంబినేషన్స్ కోసం బిజినెస్ చేయకండి అన్న కోణంలో చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు మాట్లాడటంతో ఇపుడు ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అనే అనుమానం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇపుడు సంక్షోభంలో ఉంది అంటూ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలలో ఎవరి గురించి వీళ్లిద్దరూ కామెంట్స్ చేసారు అంటూ ఆలోచనలు విశ్లేషణలు బయలుదేరాయి. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పందించారు.

కొత్త కథలు రావాలి… పాన్ ఇండియా మోజులో పడి…

నట్టి కుమార్ చిరంజీవి, ఎన్టీఆర్ మాటల మీద స్పందిస్తూ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ బాగుకోసమే చెప్పారు. కొత్త కథలు ఇండస్ట్రీకి రావాలి కానీ కాంబినేషన్ సెట్ చేసుకుని దానికి అనుగుణంగా కథ సిద్ధం చేసుకుని బిజినెస్ మీద ఫోకస్ చేయకండి అంటూ మాట్లాడారు. కథ, కథనం బాగుంటే చిన్న హీరో పెద్ద హీరో అనే తేడాలేకుండా అందరూ సినిమాను ఆదరిస్తారు. బింబిసార, కార్తికేయ, సీతారామం వంటి సినిమాలు ఇందుకు నిదర్శనం అంటూ చెప్పారు.

పాన్ ఇండియా మోజులో పడి పాన్ ఇండియా రేంజ్ కి కథ సిద్ధం చేసుకోవాలని అనుకుని ఏదో తీసేస్తే సినిమా ఎవరూ చూడరు అంటూ లైగర్ సినిమాను పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు నేటివిటీకి దూరంగా సినిమాలను తీస్తే ఎలా, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలను, కథనం పక్కాగా చేసుకుంటే అదే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో కూడా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ చెప్పారు. ఇద్దరు అగ్ర హీరోలు ఎవరిని ఉద్దేశించి అనలేదు, కేవలం ఇండస్ట్రీ బాగుకోసమే చెప్పారు అంటూ చెప్పారు నట్టి కుమార్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago