Categories: FeaturedMovie News

Natti kumar : ఎన్టీఆర్, రాజమౌళిని కెసిఆర్ టార్గెట్ చేశారా.. అందుకే బ్రహ్మాస్త్ర ఈవెంట్ రద్దు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నట్టి కుమార్

Natti Kumar : బ్రహ్మాస్త్ర సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయడానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేసుకుని హిందీ తో పాటు సౌత్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 9 న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను సౌత్ లో కూడా బాగా చేసారు. ఇక సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహారిస్తున్నాడు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను సౌత్ లో బాగా చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసిన బ్రహ్మాస్త్ర సినిమా యూనిట్ కి తెలంగాణ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీసుల బందోబస్తు ఇవ్వడం కష్టమని ఈవెంట్ ను రద్దు చేసుకోమని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో ఈవెంట్ రధ్ధయింది.

కెసిఆర్ ఎన్టీఆర్, రాజమౌళి ని టార్గెట్ చేశారా…

ఇక ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలాగ స్పందించారు. మీడియా మీట్ పెట్టి సినిమా యూనిట్ మాట్లాడింది. ఈ ఈవెంట్ కి అతిధి గా ఎన్టీఆర్ వస్తాడని ఆయన అభిమానులు ఈవెంట్ కి వచ్చేందుకు సిద్ధమైయ్యుంటారని ఎన్టీఆర్ ప్రత్యేక వీడియో అభిమానులకు క్షమాపణలు చెబుతూ విడుదల చేసారు. అయితే పొలిటికల్ హీట్ పెంచింది ఈ ఇష్యూ. రాజమౌళి తండ్రిగారు విజయేంద్ర ప్రసాద్ గారికి బీజేపీ రాజ్యసభ సీటు ఇవ్వడం, ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం వంటి అంశాలు ఇపుడు ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశం మీద ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మాట్లాడుతూ రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు అని అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడు, అయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రి మర్యాద పూర్వకంగా పిలిస్తే వెళ్లడం ఆయనకు ఇచ్చే గౌరవమే దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు. ఇక రాజమౌళి బీజేపీ రంగు ఎప్పుడు పూసుకోలేదు. ఆయన తండ్రి సినిమాలకు సేవకు గుర్తింపు గా రాజ్యసభ సీటు వచ్చింది అంత మాత్రాన రాజకీయ రంగు పులమడం కరెక్ట్ కాదు అంటూ అయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పిన వీడియోలో కూడా సినిమాలకు సంబంధిచిన విషయాలను ప్రస్తావించారు కానీ రాజకీయాలకు సంబంధిచిన ఒక్క మాట మాట్లాడలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago