Featured

Sai Kumar : 72 ఏళ్ల వయస్సులో అంత పైనుంచి దూకారు… డెడికేషన్ ఎన్టీఆర్ ని చూసి నేర్చుకున్నా : సాయికుమార్

Sai Kumar : తాజాగా డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్ర పోషించిన చిత్రం గంధర్వ. సెన్సార్ పూర్థి చేసుకొని జూలై 8న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పనలో సుబాని ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. అప్స‌ర్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమా విడుదల దగ్గర ఉండటంతో మీడియా సమావేశంలో పాల్గొన్న సాయికుమార్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

మనసుకు నచ్చినట్టుగా చేస్తూ పోతే తప్పకుండా హిట్…

మీడియా సమావేశంలో పాల్గొన్న సాయికుమార్, గంధర్వ సినిమా కథ చెప్పగానే మీరెలా ఫీల్ అవుతున్నారు అన్న ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు.. ఇంతకు ముందు కూడా కొత్త కథలు కొత్త దర్శకులతో చేశాను, అప్సర్ కి దర్శకుడిగా కొత్త సినిమా, అయినా నేను కథను నమ్మాను. చనిపోయాడు అనుకున్న నాన్న తిరిగి వస్తే ఎలా ఉంటుంది అన్న దాన్ని అప్సర్ చాలా చక్కగా చూపించాడు. అండ‌ర్ ప్లే, డ్రామా.. ఇలా చాలా క్యారెక్టర్లు నేను చేశాను. అలాంటి కోవకు చెందిన ప్ర‌య‌త్న‌మే గంధ‌ర్వ సినిమాలోని నా పాత్ర, అని చెప్పుకొచ్చారు.

ఈ జనరేషన్ హీరోలతో కలసి నటించడం ఎలా వుంటుంది అన్న ప్రశ్నకు.. ఈ సినిమాల్లో సందీప్ తో కలసి నటించాను, తాను చేసిన గత సినిమాలని చూసాను. అంతేకాకుండా స‌త్య‌దేవ్, ప్రియ‌ద‌ర్శితో కూడా ఈ సినిమాలో చేస్తున్నా. వారి నటనకు అనుగుణంగా నన్ను నేను అప్డేట్ చేసుకొని చేస్తున్నా అని చెప్పారు.

మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీఆర్ ని చూసి నేర్చుకున్నా…

ఇన్నేళ్ల నా సినీ ప్రస్థానంలో చాలా రకాల పాత్రలు చేసాను. నాటకాలు వేసే సమయం నుండి ఇప్పటి వరకు 50 ఏళ్ళు సినీ ప్రస్థానం నాది. అయినా కూడా నటుడుగా సంతృప్తి లేదు, ఇంకా ఎదో చేయాలని అనిపిస్తుంది. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీఆర్ గారి వయసు 72 సంవత్సరాలు, పైనుంచి కిందకు దుకాల్సిన సీన్ లో డూప్ లేకుండా చేశారు. నటుడుగా డెడికేషన్ ఎలావుండాలో ఆయనను చూసే నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళ్ లో ‘డీజిల్‌’ సినిమా, అందులో డీజిల్ మాఫియా లీడ‌ర్‌గా చేస్తున్నారు సాయికుమార్. ఇది కాకుండా ఓ వెబ్ సీరీస్ కూడా చేయబోతున్నారు.

Bhargavi

Recent Posts

భర్తను చంపేందుకు భార్య మాస్టర్ ప్లాన్.. చివరికి తానే చిక్కుల్లో!

కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…

28 minutes ago

‘కమ్సహమ్నిదా’ మేకింగ్ వీడియో వైరల్.. వరుణ్ తేజ్ మూవీకి హైప్ పెరిగింది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…

51 minutes ago

వరుస ఫ్లాప్‌ల తర్వాత నితిన్ కొత్త గేమ్ ప్లాన్.. సితార బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్!

వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్‌లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్‌ను ఎంపిక…

56 minutes ago

‘వైద్యో నారాయణో హరి’ని నిజం చేసిన రాజశేఖర్.. స్టార్ కూతురి ప్రాణాలు కాపాడిన కథ!

సినిమాల్లో యాంగ్రీమ్యాన్‌గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…

1 hour ago

ఓటమి తర్వాత హార్దిక్ ప్రవర్తనపై చర్చ.. కెప్టెన్‌గా ఒత్తిడి పెరుగుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…

1 hour ago

కిస్ సీన్ చేస్తూ షాక్ అయ్యా.. కాజోల్ సంచలన కామెంట్స్!

బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…

1 hour ago