Featured

Raghu Kunche : పవన్ కళ్యాణ్ చుట్టూ పూజారి బ్యాచ్ భజన చేసి.. ఆయనతో నా సినిమాని ఆపేశారు : రఘు కుంచె

Raghu Kunche : సింగర్ గా వెయ్యి కి పైగా పాటలు పాడిన రఘుకుంచే, అంతకు ముందు పలు టీవీ ఛానెల్స్ లో యాంకర్ గా కూడా అలరించాడు. ఇక చాలా సినిమాల్లో పాటలు పాడిన రఘు, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రాణించాడు. మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కసారిగా అదృష్టం కూడా కలిసి రావాలి అన్నట్లుగా రఘు కెరీర్ లో పెద్ద హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు వచ్చినా ఆ తరువాత చేజారిపోయాయి. ఇక తన కెరీర్ లో పూరీ తో ఉన్న అనుబంధాన్ని రఘు గుర్తుచేసుకున్నారు.

పవన్ చుట్టూ భజన చేసే పూజార్లు ఉంటారు…

పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడిన రఘు స్వతహాగా పూరీ కి సన్నిహితంగా ఉండటంతో మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తానని రఘు అడిగితే ఓకే అన్నాడట పూరీ. అయితే గోపీచంద్ కాంబినేషన్ లో తీసిన గోలిమార్ సినిమాకు రఘు మ్యూజిక్ చేయాల్సి ఉన్నా, అప్పటికే పూరీ చక్రి కాంబినేషన్ హిట్ కానీ చక్రి కి ఆరోగ్యసమస్యల కారణంగా నన్ను గోలిమార్ కి చేయమని చెప్పాడు. కానీ చివర్లో చక్రి, తన భార్యతో కలిసి వచ్చి అడిగే సరికి నన్ను క్యాన్సిల్ చేసి చక్రి ని పెట్టుకోవాల్సి వచ్చిందని రఘు చెప్పాడు. ఇక ఆ సినిమా తరువాత దేవుడు చేసిన మనుషులు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది.

సినిమా హిట్ అవ్వకపోయినా పాటలు బాగా హిట్ అయి పలు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం నీకే ఇస్తా అని పూరీ మాటిచ్చాడట. పెద్ద హీరో సినిమాకు చేస్తే కెరీర్ సెట్ అవుతుంది అని పవన్ కు కూడా చెప్పి ఓకే చేసాడట పూరీ. కానీ పవన్ చుట్టూ ఉండే భజన బ్యాచ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను రికమెండ్ చేయడం, అతన్ని ఒకే చేయడంతో అవకాశం చేజారిందని రఘు చెప్పాడు. ఇక నటుడుగా పలాస సినిమా తరువాత విలన్ అవకాశాలు చాలా వస్తున్నాయని, అలా నటుడుగా సక్సెస్ అయి పెద్ద సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసే అవకాశం తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు రఘు చెప్పాడు.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

31 minutes ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

36 minutes ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

40 minutes ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

46 minutes ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

51 minutes ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

58 minutes ago