Super Star Krishna : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా, ప్రధాన మంత్రి పాల్గొని 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని భీమవరం లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మెగాస్టార్ చిరంజీవితో పాటూ ఇంకా ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే అల్లూరి వారసులను ప్రధాని వేదిక మీద సత్కరించడం కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ తప్పకుండా హాజరు అవుతారని అందరూ అనుకున్నారు.
విగ్రహావిష్కరణకు కృష్ణ ఎందుకు రాలేదు…
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకు అభిమానులలో ఊహించని స్థాయిలో గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణకు తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కృష్ణ సినీ ప్రస్థానంలో వున్న స్పెషల్ మూవీస్ లో అల్లూరి సీతారామరాజు ఒకటి. అల్లూరి సీతారామరాజు పేరు అనగానే ప్రేక్షకుల మదిలో కృష్ణ రూపం గుర్తొస్తుంది. అయితే ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగగా, కృష్ణ ఈ కార్యక్రమానికి హాజరవుతారని అభిమానులు అందరూ భావించారు. కానీ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. అయితే ఈ కార్యక్రమానికి కృష్ణకు ఆహ్వానం అందిందని, అయితే వయస్సు ఇంకా ఇతర కారణాల వల్ల కృష్ణ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని వార్తలు వస్తున్నాయి. అన్ని వేడుకలకు దూరంగా వున్నా కృష్ణ ఈ మధ్య కుటుంబ సభ్యులను తప్ప ఇతరులను కలవాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వార్తలు.
కృష్ణ వల్లనే అల్లూరి చరిత్ర గొప్పదనం తెలుగు వారికి చేరువ అయ్యింది అనడం లో ఆశ్చర్యం లేదు. అయితే కృష్ణ తో పాటు మరో సీనియర్ హీరో కృష్ణంరాజుకు కూడా ఆహ్వానం అందిందని ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సమాచారం. ఇది ఇలా ఉండగా కృష్ణ రాలేకపోయినా కృష్ణ కుటుంబం నుంచి ఎవరైనా ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే బాగుండేదని అభిమానులనుండి కామెంట్లు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…