Poojitha : ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా రెండో హీరోయిన్ గా నటించిన పూజిత ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా రానించలేకపోయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన పూజిత ఆ తరువాత సినిమాలకు దూరమై ప్రేక్షకులకు కనిపించలేదు. చాలా రోజుల తరువాత తన భర్త మీద కేసు పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన పూజిత, తన భర్త మోసం చేసాడని మళ్ళీ ఒక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తాను ఎదుర్కొన్న సమస్యలు ఏ అమ్మాయికి రాకూడదంటూ ఎమోషనల్ అయ్యారు.
నరేష్ నెత్తి మీద శనిని పెట్టుకున్నాడు…
తన భర్త మీద కేస్ పెట్టాలని అనుకున్నపుడు ఎవరూ సహకరించలేదని, ఐఏఎస్ అధికారి ఇందులో ఉండటం వల్ల నా కేస్ ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు పూజిత. ఇక మా అసోసియేషన్ కి సహాయం చేయమని అడగడానికి వెళితే మొహం చాటేసారని అప్పుడు మా అసోసియేషన్ లో రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా ఉన్నారు, అయినా నా సమస్య ఏంటని వినడానికి కూడా సిద్ధంగా లేరని తెలిపారు. నా బాబు ని పెంచుకుంటూ సింగల్ గా ఉంటూ చాలా కష్టాలు పడ్డాను కానీ ఎవరినీ సహాయం అడగలేదు.
కానీ నాకు తెలియకుండా నరేష్ సహాయం చేసాడు అంటూ చెప్పారు పూజిత. మా అసోసియేషన్ లో ఉన్నపుడు కూడా నరేష్ చాలా మంచి పనులు చేసారని కళ్యాణ లక్ష్మి, వికలాంగులకు సహాయం అందించడం ఇంకా చాలా మంచి పనులు చేసాడని చెప్పారు. కానీ అయనంటే పడని వాళ్ళు నెగెటివిటీ ప్రచారం చేసారని తనకు కావాల్సిన మనుషులకు సహాయం అందించారని విమర్శించారు. అయితే ఇదంతా నరేష్ చేసుకున్నదే, చేసిన పని చెప్పుకోక పోతే ఇలానే ఉంటుంది. శనిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ మాట్లాడారు పూజిత. తనకు సహాయం చేసిన సంగతి చాలా రోజులకు తెలిసి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లినా చెప్పనివ్వలేదు, తను నాకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది పూజిత.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…