Featured

Sai Pallavi : సినిమా హిట్ అవ్వకపోతే నిర్మాతకు నష్టాలోస్తాయని బాధ పడతాను.. శర్వానంద్ సినిమా విషయంలో నిర్మాతకు ఫోన్ చేసి అలా అంటే..!

Sai Pallavi : అందరి హీరోయిన్లలా తాను కాదు, తాను డిఫరెంట్ అని నిరూపించుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఏ మాత్రం గ్లామర్ షో చేయకుండా సినిమాల్లో ఏదో హీరోయిన్ ఉందా లేదా అనేలాంటి పాత్రలు చేయకుండా కథలో తన పాత్ర బాగుంటేనే ఏ సినిమా అయినా చేసే సాయి పల్లవి ప్రేక్షకుల అభిమానాన్ని పొందడమే కాకుండా గౌరవం, మర్యాద కూడా సంపాదించుకుంది. తాను నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.

రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి….

ఇక సాయి పల్లవి కెరీర్ లోనూ కొన్ని పరాజయం పొందిన సినిమాలు ఉన్నాయి. ఇక ఈ విషయం గురించి సాయి పల్లవి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సాయి పల్లవి పై గౌరవాన్ని మరింత పెంచాయి. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన ‘పడి పడి లేచే మనసు’ సినిమా కమర్షియల్ గా విజయం పొందలేదు. దీంతో సాయి పల్లవికి ఆల్రెడీ అడ్వాన్స్ చెల్లించి నిర్మాతగా నష్టపోయిన సుధాకర్ గారికి సాయి పల్లవి తల్లి ఫోన్ చేసి రెమ్యూనరేషన్ వద్దని చెప్పారట. కానీ సుధాకర్ గారు నష్టాలను భరిస్తూనే ఒక్క రూపాయి కుడా తగ్గించకుండా మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చారట. తన సినిమా పరాజయం పొందినపుడు సాయి పల్లవి చాలా మదన పడుతుందట, సాయి పల్లవి తన వల్ల నిర్మాతకు నష్టం వచ్చిందని బాధపడుతుందట.

తన ప్రతి విషయంలోనూ తల్లి నిర్ణయం తీసుకుంటుంది అయితే సినిమా కథల ఎంపిక విషయంలో మాత్రం నేనే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని సాయి పల్లవి తెలిపింది. విరాట పర్వం సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సాయి పల్లవి తన రెమ్యూనరేషన్స్, గ్లామర్ షో గురించి తన అభిప్రాయాలను తెలిపింది. గ్లామర్ షో చేయకుండా నటించే అవకాశం వచ్చిన సినిమాలను కథ నచ్చితే చేస్తానని అలాంటి అవకాశాలు రాకపోతే డాక్టర్ వృత్తిలో స్థిరపడుతానని క్లారిటీ ఇచ్చింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago