NTR Son Bhargav Ram : తాతకు తగ్గ మనవడిగా నందమూరి వారసత్వాన్ని బాబాయ్ బాలకృష్ణ తరువాత నిలబెడుతూ నందమూరి అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్. నటనలో, డైలాగులు చెప్పడంలో తన తాత ఎన్టీఆర్ ను గుర్తుకు తెస్తారు. తారక్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియా రేంజ్ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అచ్చం తండ్రిలా ఉన్న భార్గవ్ రామ్….
ఇక ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి అభయ్ రామ్, చిన్న అబ్బాయి భార్గవ్ రామ్. భార్గవ్ రామ్ పుట్టినరోజు జూన్ 14 సందర్బంగా నందమూరి అభిమానులు చేసిన రచ్చ మాములుగా లేదు. ఏకంగా భార్గవ్ రామ్ పేరిట ఫ్యాన్స్ క్లబ్ లను ఏర్పాటు చేసారు. ఇక ట్విట్టర్ లో #HBDBhargavRam అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేశారు. ఇక చాలా మంది సెలబ్రిటీలు కూడా భార్గవ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. రూపంలో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల పోలికలతో ఉన్న భార్గవ్ రామ్ కు నందమూరి అభిమానుల్లో క్రేజ్ ఎక్కువుంది.
ఎన్టీఆర్, తారక్, భార్గవ్ రామ్ ల ఫొటోలతో బండ్ల గణేష్….
ఇక ఎపుడు వివాదాస్పద వాఖ్యలు చేసే బండ్ల గణేష్ కూడా సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, భార్గవ్ రామ్ ఫోటోలను ట్వీట్ చేసారు. అయితే భార్గవ్ రామ్ కు పుట్టినరోజు విష్ మాత్రం చేయకపోయినా తాత, తండ్రి లా ఉన్న భార్గవ్ రామ్ అన్నట్లుగా పెట్టారని చాలా మంది భావిస్తున్నారు. మరికొంతమంది తన తాత వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ నిలబెట్టినట్లు నెక్స్ట్ తారక్ కొడుకుగా భార్గవ్ రామ్ సినిమాల్లోకి వచ్చి నందమూరి అభిమానులను అలరిస్తాడని భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…