Allu Arjun: వామ్మో పుష్ప లారీ చేసింగ్ సీన్ లో లారీ లేకుండానే సీన్ చేశారా.. భారీగా ఉపయోగించిన వీఎఫ్ఎక్స్?
Allu Arjun: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయ్యే అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి.
ఇక ఈ సినిమా నిర్మాణంలో భాగంగా మేకర్స్ భారీ విజువల్ ఎఫెక్ట్ ఉపయోగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ చేంజింగ్ సన్నివేశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సన్నివేశంలో అల్లుఅర్జున్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే. అయితే ఈ సన్నివేశం కోసం ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.
ఈ సన్నివేశంలో లారీ లేకుండానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సన్నివేశానికి ఓ ట్రాలీపై లారీ ముందు భాగం డోర్ వరకు సెట్ ను నిర్మించారు. ఆ తర్వాత కావాల్సిన సన్నివేశాన్ని చిత్రీకరించి. మిగిలినది మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తూ ఎక్కడ తేడా కొట్టకుండా ఎంతో అద్భుతంగా గ్రాఫిక్ వర్క్ పూర్తి చేసారు.
ఈ సన్నివేశంతో పాటు పుష్పరాజ్ నదిలో ఎర్రచందనం దుంగలను పడేసే సన్నివేశం కూడా విజువల్ ఎఫెక్ట్స్ తో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.మొత్తానికి ఈ సినిమాలు భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎంతో అద్భుతంగా జరిగి సినిమా మొత్తం ఎంతో నేచురల్ గా చిత్రీకరించారని చెప్పాలి. పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకుంటుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…