Featured

Sai Pallavi : సాయి పల్లవి పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందా…? ఆలోచనలు ఎటువైపు…

Sai Pallavi : సాయిపల్లవి తెలుగు తమిళ మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ నటనలో తనదైన శైలితో అభిమానులను సంపాదించుకుంది. తమిళ సినిమా అయినా ప్రేమమ్ తో సినిమా రంగానికి పరిచయమైన సాయి పల్లవి, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో నటించి అభిమానులను తన నటన తో డాన్స్ తో ఫిదా చేసింది. తర్వాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన తను మాత్రం ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యకుండా మంచి కథ ఉంటేనే నటిస్తోంది. రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలతో ఈ నేచురల్ బ్యూటీ సెన్సేషనల్ హిట్ ల ను సంపాదించుకుంది.

ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ,శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలు వంటి ఘన విజయాల తర్వాత కూడా సాయి పల్లవి వరుసగా ఆఫర్లు వస్తూ ఉన్న తను మాత్రం ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి హీరో గా వస్తున్న భోళా శంకర్ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ ఆఫర్ చేయగా సున్నితంగా తిరస్కరించిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో సాయి పల్లవి ఎందుకు కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు అని అనుమానాలకు చర్చలకు దారితీస్తోంది.

సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోందా….

ఈమధ్య సాయిపల్లవి ఎక్కువగా కనిపించకపోవడం కొత్త సినిమాలను ఓకే చేయకపోవడం వల్ల కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. సాయి పల్లవి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా మాత్రమే విడుదల కావాల్సి ఉంది. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదని సాయిపల్లవి సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.

సాయిపల్లవి ప్రస్తుతం సినిమాలు చేయకపోవడానికి కారణం పెళ్లి చేసుకోబోవడం కాదని, చేయబోయే సినిమాలు తన ఇమేజ్ ని ఇంకా పెంచేలా గా ఉండాలని అందుకే తొందరపడి కమిట్ అవ్వట్లేదు అని చెబుతున్నారు. అందుకే సాయి పల్లవి మంచి కథ కోసం ఎదురు చూస్తోందని కథ నచ్చితే సినిమా చేయడానికి తన సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం తాను చేయబోయే సినిమాలు ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాలను మించి ఉండాలని పల్లవి కోరుకుంటోంది అట. అయితే సాయి పల్లవి పెళ్లి విషయంలో వచ్చినా రూమర్లపై అభిమానులు సాయిపల్లవి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago