Chiranjeevi: అంత జ్వరంలో కూడా శ్రీదేవితో కలిసి డాన్స్ చేశా… మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా స్టార్!
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి స్వయంకృషితో ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెగాస్టార్ రేంజ్ కి వెళ్ళారు. అయితే ఈయన మెగా స్టార్ అవ్వడం వెనుక ఎంతో కష్టం, శ్రమ దాగి ఉన్నాయని మెగాస్టార్ ఎన్నోసార్లు వెల్లడించారు.తాజాగా మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని యూసఫ్ గూడలో నిర్మించిన సినీ కార్మిక కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి ఈ సందర్భంగా మెగాస్టార్ బయటపెట్టారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవితో కలిసి ఒక డాన్స్ చేయాల్సి ఉంది అయితే ఆ సమయంలో 103 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నాను. అయినా వాటిని లెక్కచేయకుండా డాన్స్ చేశానని మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇప్పుడు కూడా గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లాలి, మైత్రి మూవీ కోసం హైదరాబాద్ రావాలి.ఇలా నిత్యం షూటింగుల కోసం తిరగాల్సి వచ్చి ఎంతో అలసిపోతున్నాను. అయితే నేను అలసిపోయానని చెబితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేస్తారు.నా ఒక్కడి వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయితే ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ల ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ముఖ్యంగా నిర్మాతలు ఎంతో నష్ట పోవాల్సి ఉంటుంది కనుక వీటన్నింటిని బయటకు చెప్పకుండా తన పని తాను చేసుకుపోయే వాడినని మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.కేవలం నేను మాత్రమే కాకుండా అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా సినిమాకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని కష్టాలు ఉన్న చిరునవ్వుతో షూటింగ్లో పాల్గొనేవారని, ఈ సందర్భంగా మెగాస్టార్ వెల్లడించారు.కార్మిక దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…