Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా గుర్తింపు పొందారు.తాజాగా ఈమె నటించిన విరాటపర్వం సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయి పల్లవి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన ప్రేమ విషయాన్ని బయట పెట్టినట్టు తెలుస్తోంది.తాను నాన్ వెజ్ తిననని అయితే తాను ప్రేమించిన వ్యక్తి కోసం స్వయంగా మార్కెట్ కు వెళ్లి తనకు నాన్ వెజ్ చేసి పెట్టానని సాయిపల్లవి తెలిపారు.
పెళ్లి గురించి మాట్లాడుతూ తాను సింగిల్ గా ఉంటానో లేక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారు.ఈ విధంగా సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు ఈమె టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని పెద్దఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అతను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగిల్ గాఉన్నారని త్వరలోనే వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక విరాటపర్వం సినిమా విడుదలైన తర్వాత సాయి పల్లవి తన ప్రేమ విషయాన్ని బయట పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం తన వయసు 30 సంవత్సరాలని అదే విధంగా తను సినిమాల్లో గ్లామర్ పాత్రలలోఎలాగో చెయ్యదు కనుక పెళ్లయిన తర్వాత కూడా తన సినీ కెరీర్ పై ఏ విధమైనటువంటి ప్రభావం పడే అవకాశం లేదని చెప్పవచ్చు. ఇక తన కెరియర్ పై ప్రభావం చూపిన తన చేతిలో ఎలాగో మెడిసిన్ ఉందని డాక్టర్ గా స్థిరపడతానని ఈమె తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…