Software Jobs: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న భారతీయులు.. కొత్త రంగం వైపు అడుగులు వేస్తున్న యువత!
Software Jobs: గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు కరోనా వల్ల ఎన్నో విభిన్న దారులు ఏర్పడ్డాయని చెప్పాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువత మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున వీరి ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వీరికి నచ్చిన విధంగా ఉద్యోగాలు చేయడం కోసం లేదా సరికొత్త రంగం వైపు అడుగులు వేయడం కోసం పెద్దఎత్తున ఉద్యోగస్తులు రాజీనామాలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ డిజిటల్ ఓషన్ ప్రకారం.. ఏకంగా 42 శాతం మంది వారి ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు ప్రకటించింది.
ప్రస్తుత సర్వే ప్రకారం ఒక సంవత్సరం పాటు ఉద్యోగంలో ఎక్స్పీరియన్స్ కొనసాగించిన అభ్యర్థులు వారు చేస్తున్న కంపెనీకి రాజీనామా చేసి మరికొన్ని కంపెనీలలో ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా డెవలపర్స్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు మారడానికి గల కారణం సరైన వేతనాలు లేకపోవడం లేదంటే తమకు అనుగుణంగా ఉండే ప్రాంతాలలో పని చేయడానికి ఆసక్తి చూపడంతో ఇలా పెద్ద ఎత్తున ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్నారు.
సంవత్సరం కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న 27 శాతం మంది అభ్యర్థులు కొత్త ఉద్యోగాలకు ఆసక్తి చూపుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ది మోషన్ ప్రతినిధుల అంచనాప్రకారం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎనిమిది శాతం మందిలో ఒకరు సొంతంగా కంపెనీ ప్రారంభించి పలువురుకు ఉద్యోగాలు కల్పించే యోచనలో కూడా ఉన్నారు. బ్లాక్‌చెయిన్, వెబ్ 3 టెక్నాలజీల చుట్టూ సంచలనం ఉన్నప్పటికీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లలో 67 శాతం మంది ఇంకా బ్లాక్‌చెయిన్/ వెబ్ 3ని ఉపయోగించడం లేదని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…