Categories: FeaturedMovie News

Josh Ravi : ఆ రోజు సెట్ లో నా గొంతు కోసినట్టు అయిపోయింది.. చిరంజీవి గారు నన్ను పిలిచి ఏమన్నారంటే.. తలుచుకుంటేనే ఏడుపొస్తుంది.. : జోష్ రవి

Josh Ravi : తెలుగులో చిన్నగా సినిమాల్లో తన ప్రయాణం మొదలుపెట్టిన రవి, నాగచైతన్య జోష్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, జోష్ రవి గా తన పేరు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో కమెడియన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను చేసిన జోష్ రవి తన అభిమాన హీరో గురించి అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చాడో, జబర్దస్త్ నుండి వెళ్ళిపోడానికి కారణాలను వివరించాడు.

అమ్మ, నాన్న తరువాత ఆ హీరోనే…

జోష్ రవి చిన్నతనం నుండి మెగాస్టార్ వీరాభిమాని. చిరంజీవి గారిని దైవంలా చూసే వ్యక్తి. ఆయన ప్రభావం వళ్లే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇక చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో చేయడం మొదలు పెట్టాక జోష్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ ఆతరువాత నితిన్ సినిమా గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలో గే పాత్రను చేసి మరింత క్రేజ్ సంపాదించాడు.

తనికెళ్ళ భరణి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన జోష్ రవి కామెడీ పాత్రల్నే చేయకూడదని తనకు నచ్చిన పాత్రాలను సినిమాల్లో నటించాడు. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో తరువాత అటువంటి వేషాలు చాలానే వచ్చినా సున్నితంగా తిరస్కరించాడు. జబర్దస్త్ లోనూ వచ్చిన రవి చాలా ఏళ్ళు జబర్దస్త్ లో స్కిట్స్ చేసారు. కానీ ఇక సినిమాల్లో అవకాశాలు రావడం కేవలం కామెడీ వేషాలకే పరిమితమవ్వకూడదనే జబర్దస్త్ నుండి బయటికి వచ్చినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక చిరంజీవిని బాగా ఇమిటేట్ చేసే రవి మీలో ఎవరు కోటీశ్వరుడు సమయంలో ఆయనను కలిశారు. చిరంజీవి గారు మీలో ఎవరు కోటీశ్వరుడు సమయంలో నన్ను చాలా ఆప్యాయంగా పలకరించారని తన తల్లితో కూడా మాట్లాడి ఆవిడ కోసం చీర పంపారాని చెప్పాడు.

మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీ లో లేకపోతే ఖచ్చితంగా ఇండస్ట్రీ కి వచ్చే వాడిని కాదని ఆయన లేకపోతే హైదరాబాద్ తో పని లేదంటూ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని చెప్పారు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేస్తున్న సమయంలో ఆ షోలో తన క్యారెక్టర్ పొడిగించడం వల్ల అప్పటికే కమిట్ అయిన సినిమా ఉండటంతో ఏం చేయాలో తోచలేదని చెప్పారు. ఇటు చిరంజీవి గారి షో చేయాలా లేక అప్పటికే కమిట్ అయిన సినిమా కోసం ఈ షో వదిలేయాలో అర్ధం కాలేదని తెలిపారు. ఆ ఆరోజు సెట్ లో ఎవరో గొంతు కోసినట్టు అయిపొయింది. అసలు గుటక మింగలేకపోయాను.. ఆ సమమంలో చిరంజీవి గారు జోష్ రవిని పిలవండి అన్నారు. వెళ్ళగానే అయన నువ్వు బాధ పడుతున్నావు కదా అన్నారు.. ఏం కంగారు పడకు నేను ఉన్నాను.. నువ్వు చేస్తున్నావు… ఇక నుంచి జోష్ రవి డేట్స్ చూసుకుని షో టైం ప్లాన్ చేయండి అని చెప్పారు. ఇక ఆయన తరువాత ఇప్పటి తరాల్లో హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ నచ్చుతారని, ఆయన ఇండియాలో టాప్ టెన్ నటుల్లో ఒకరని వాఖ్యణించారు. ఇక రైటర్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హర్ష వర్థన్ గారితో మనస్పర్థల గురించి స్పందించారు. నాకు ఆయనకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వళ్లే మనస్పర్థలు వచ్చాయని చెప్పుడు మాటలు ఆయన విన్నారని, నేను చేయని పనికి క్షమాపణలు చెప్పలేనని రవి చెప్పారు. గుండె జారి గల్లంతయ్యిందే సినిమా సమయంలో ఈ ఇష్యూ జరిగింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago