Categories: FeaturedMovie News

Adhire Abhi : జబర్దస్త్ అదిరే అభికి షూటింగ్ లో ప్రమాదం.. చేతికి, కాలికి తీవ్రగాయలు..!

Adhire Abhi : ప్రభాస్ సినిమా ఈశ్వర్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అభినయ కృష్ణ. జబర్దస్త్ లో అడుగుపెట్టి అదిరే అభిగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలపైన ఇష్టంతో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగాడు. జబర్దస్త్ లో చాలా ఏళ్లుగా స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇక సినిమాల్లో అడపాదడపా నటిస్తూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటున్నాడు.

షూటింగ్ లో ప్రమాదం….

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ నుండి చాలా మందీ ఫేమస్ కమెడియన్స్ వెళ్లిపోయారు అలాగే అదిరే అభి కూడా జబర్దస్త్ వదిలేసాడు. చాలా ఏళ్లుగా జబర్దస్త్ తో ఉన్న అనుబంధాన్ని ఇంకా మంచి అవకాశాల కోసం వదిలి వెళ్లిపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు జబర్దస్త్ ను వీడడానికి మరో కారణం. ఇపుడు అదిరే అభి కూడా సినిమాల్లో అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడు. కాగా ప్రస్తుతం ఒక సినిమాలో హీరోగా లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలను చేసేటపుడు ప్రమాదం జరిగింది. అభి చేతికి, కాలికి గాయాలు తగిలాయని సమాచారం.

ముఖ్యంగా చేతికి తీవ్రగాయలు అయ్యాయి. వెంటనే హాస్పిటల్ కి తరలించగా చేతికి 15కుట్లు పడ్డాయని సినిమా బృందంలోని వ్యక్తి సమాచారమిచ్చారు. అయితే అదిరే అభి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక అదిరే అభి త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago