Sai Pallavi:సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఈ టీవీకి దూరమైనప్పటికీ ఇతర చానల్స్ లో వివిధ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే జీతెలుగు మాటీవీలో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న దిల్ సే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ ఆదివారం ప్రసారం కాబోయే స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా పలువురు తమ తండ్రుల గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు సైతం సందడి చేశారు.గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రం నుంచి హీరో హీరోయిన్స్ వేదికపై సందడి చేయగా విరాటపర్వం టీమ్ కూడా దిల్ సే కార్యక్రమం పై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి ఎంట్రీ ఇస్తూనే అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా రానా, నిర్మాత సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుదీర్, శ్రీముఖి ఇద్దరూ సాయిపల్లవి, రానాను పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే శ్రీముఖి సాయి పల్లవిని ప్రశ్న అడుగుతూ తెలంగాణ భాషలో వేస్ట్ ఫెలోని ఏమని పిలుస్తారు అంటూ సుధీర్ ని చూపిస్తూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సాయిపల్లవి సమాధానం చెబుతూ హౌలేగా! అని పిలవడంతో ఒక్కసారిగా సుడిగాలి సుదీర్ వింత ఎక్స్ప్రెషన్ తో షాకయ్యారు. అనంతరం సాయి పల్లవి అన్న మాటలను సరదాగా తీసుకొని మీరు హౌలేగా అన్నా కానీ హల్వాలా స్వీట్ గా ఉంది అంటూ కవర్ చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సింగర్ ఎస్.పి.శైలజ దంపతుల 30 వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరిపినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా కొనసాగుతుందని తెలుస్తుంది.ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదాన్ని చూడాలంటే ఆదివారం సాయంత్రం వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…