Pranitha Subhash:నటి సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాశ్మీర్ పండిట్ల హత్యలను, ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కొట్టి చంపి జైశ్రీరామ్ అంటూ చెప్పడం రెండు ఒకటేనని, అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పు లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతోమంది స్పందిస్తూ సాయిపల్లవి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆమె పై కేసు నమోదు చేయడమే కాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురు నటి సాయి పల్లవి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా గురువారం నటి ప్రణీత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇండైరెక్టుగా సాయిపల్లవి పై తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సాయి పల్లవి పేరు ఎక్కడ ఉపయోగించకపోయినప్పటికీ ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..కాశ్మీరీ ఇస్లామిస్ట్ మిలిటెన్సీని చిన్న సమస్యగా భావిస్తున్నట్లయితే.. కాశ్మీరీ పండిట్ల దుస్థితిని ఒక సాధారణ సమస్యగా భావించినట్లయితే మరోసారి ఈ సినిమా చూడండి. సినిమా చూసి బాధితుల ఆర్థనాథాలను విను, సాను భూతి చూపించు అని పేర్కొన్నారు.
ఈ పోస్టులో ప్రణీత ఎక్కడ సాయి పల్లవి పేరు ఉపయోగించకపోయిన పరోక్షంగా సాయిపల్లవి ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు సాయిపల్లవి పేరు కూడా ప్రస్తావించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఆమెపై నెగిటివిటీ తీసుకువచ్చాయి.అయితే ఈ విషయం గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడినా అది కేవలం సినిమా ప్రమోషన్ కోసమే అవుతుందని అయితే తప్పకుండా ఈ విషయంపై వివరణ ఇస్తానని సాయిపల్లవి తెలియజేశారు.
తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…