Sai pallavi: సినీనటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమైన ఈమె తన మొదటి సినిమాలోని తన నటన నాట్యంతో ప్రేక్షకులు అందరినీ కూడా ఫిదా చేశారు. సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న తర్వాత స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు వచ్చినా కూడా ఈమె వాటిని రిజెక్ట్ చేశారు. సాయి పల్లవి సినిమాలలో నటిస్తోంది అంటే అందులో కథకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అర్థం.
ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఆ సినిమాలలో ఎంతో సహజంగా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సాయి పల్లవి ఈ తరం సావిత్రి, సౌందర్య అని చెప్పవచ్చు. ఎలాంటి గ్లామర్ షోకి తావు లేకుండా ఈమె సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.
ప్రస్తుతం సాయి పల్లవి సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి పల్లవి రెమ్యూనరేషన్ పరంగా నిర్మాతలను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టదు అయితే ఈమె నటించిన ఓ సినిమా భారీ డిజాస్టర్ అయ్యి నిర్మాతలకు నష్టాలు రావడంతో ఏకంగా తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తుంది.
పడి పడి లేచే మనసు..
హీరో శర్వానంద్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం పడి పడి లేచే మనసు. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయింది కానీ ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ కావడంతో నిర్మాత భారీగా నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అప్పటికే అడ్వాన్స్ రూపంలో కొంత డబ్బు తీసుకున్న ఈమెకు నిర్మాత పూర్తి పేమెంట్ చేశారు. కానీ సాయి పల్లవి మాత్రం రెమ్యూనరేషన్ మొత్తం తీసుకోలేదని నిర్మాత నష్టాలలో ఉన్నారని తెలుసుకొని ఏకంగా 40 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారని తెలుస్తోంది. ఇలా నిర్మాతకు రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారనే విషయం తెలిసిన అభిమానులు ఈమె మంచి మనసుకు ఫిదా అవుతున్నారు.
Video :
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…