శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన “ఫిదా” సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమా ఫిదాలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసిందని చెప్పవచ్చు.ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకున్న సాయిపల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా ఒక పాన్ ఇండియా సినిమాలో చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తమిళం దిగ్గజ నిర్మాణ సంస్థ అయినటువంటి డ్రీమ్ వారియర్ బ్యానర్ పై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈ కథకు గౌతమ్ రామ చంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నటించటానికి మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య సరసన నటించిన “లవ్ స్టోరీ” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా దగ్గుబాటి రానా హీరోగా “విరాటపర్వంలో” కూడా సాయి పల్లవి సందడి చేయనున్నారు. ఇక నాని “శ్యామ్ సింగరాయ్” లో కూడా నటిస్తున్నారు. ఈ తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా సాయి పల్లవి ఎంతో బిజీగా ఉన్న సమయంలో పాన్ ఇండియా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…