సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఉండగా అందులో ఎన్నో సినిమాలు రూపొందుతున్నాయి. ఇక పలువురు నిర్మాతలు కూడా సొంతంగా నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మరో నిర్మాత యార్లగడ్డ వెంకటరమణ కూడా ‘సాయిరాం ప్రొడక్షన్’ అనే నిర్మాణ సంస్థను పూజా కార్యక్రమాలతో ఆవిర్భవించాడు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తనికెళ్ల భరణి పాల్గొన్నాడు.
ఇక యార్లగడ్డ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించాలన్న కోరికతో ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇందులో ఎక్కువగా యువకులను, మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించాలన్న ఆలోచనలో యార్లగడ్డ ఉన్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే రెండు సినిమాలను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారట.
పైగా శ్రీపాల్ రెడ్డి, వీర అనే దర్శకులు తమ దర్శకత్వంలో ఈ నిర్మాణ సంస్థలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల గురించి త్వరలోనే తెలుపుతామని ప్రకటించారు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపాడు వెంకటరమణ.
తనికెళ్ల భరణి ఆశీస్సులు కూడా తమకు ఉన్నాయని తెలిపాడు. తనికెళ్ళ భరణి కూడా కొన్ని విషయాలు పంచుకోగా.. సాయిరాం ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ మంచి రోజు ప్రారంభమవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇక కొన్ని విషయాలు పంచుకుంటూ..ఈ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమా స్క్రిప్టులు చాలా బాగున్నాయని త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపాడు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…