Movie News

పెళ్లిరోజు సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్… పాత ప్రేమ అంటూ ఎమోషనల్ అయిన సమంత..!

గత కొద్ది రోజుల నుంచి సమంత నాగ చైతన్య విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య దంపతులు అక్టోబర్ 2వ తేదీ అధికారికంగా వారి విడాకుల విషయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా సమంత అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏ విధంగాను సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు. ఈ క్రమంలోనే నేడు సమంత మొట్టమొదటిసారిగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.

నిజానికి సమంత అక్టోబర్ 8వ తేదీ జరగబోయే లాక్ మీ ఫ్యాషన్ షోలో భాగంగా ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో సమంత వైట్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా ఉంటూ వైట్, పింక్ కలర్ గులాబీ పువ్వులు పెట్టుకుని కిందకు చూస్తూ ఉన్నారు. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఫోటో కింద ఇలా రాసుకొచ్చింది.

పాత ప్రేమ పాటలు… పర్వతాలు, శిఖరం పై వీచే శీతాకాలపు గాలిలుల ధ్వని.. పోగొట్టుకున్న పాత చిత్రాల ప్రేమ పాటలు దొరికినప్పుడు లోపలి బాధను ప్రతిధ్వనించే ప్రేమ పాటలు.. పాత బంగళాలు.. సంధులలో గాలి శబ్దం అంటూ సమంత ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ పోస్ట్ సమంత ఫ్యాషన్ షో కి సంబంధించినది అయినప్పటికీ ఇందులో ఏదో తెలియని బాధ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే సమంత నాగచైతన్య 2017 అక్టోబర్ 7వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈ దంపతులు ఇద్దరూ వీరి నాలుగవ పెళ్లి రోజున నేడు ఎంతో ఘనంగా జరుపుకునే వారు.నేడు తన పెళ్లి రోజు కావడంతో సమంత తన ప్రేమను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago