బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3వ తేదీ క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎన్సీబీఅధికారులు అతనిని అరెస్టు చేశారు. అయితే అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం పలుసార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు అతని బెయిల్ ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై పలువురు సినీ తారలు స్పందిస్తూ ఆర్యన్ కు మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలోనే హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే వీరు మాట్లాడుతూ కొందరు రాజకీయ లబ్ధి కోసం వారి స్వార్థం కోసం ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపగా మరోసారి వారికి తీవ్ర నిరాశ ఎదురైంది.
ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమి అలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థ చట్టాలను అడ్డు పెట్టుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఎంతో మంది మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
అలాంటి వారిని విడిచిపెట్టి కేవలం ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నారంటూ అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారని, మానభంగాల కన్నా డ్రగ్స్ నేరం కాదని, ఇదెక్కడి న్యాయం ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగం, అన్యాయం అంటూ సోమి అలీ ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించారు.90లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె గతంలో సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…