Featured

Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం, ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

Salman Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సల్మాన్ ఖాన్ కి ఉన్న గుర్తింపు వల్ల నిరంతరం అతనికి సెక్యూరిటీ చాలా అవసరం. ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తి సల్మాన్ ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా అతనికి నిరంతరం థ్రెట్ ఉండటమే కాకుండా ఫ్యాన్స్ కూడా సల్మాన్ ఎక్కడికి వెళ్లినా.. వేలాదిగా తరలివస్తారు. దీంతో అతడిని హై సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

స్టార్ సెలబ్రిటీ అయిన సల్మాన్ ఖాన్‌కు నిరంతరం రక్షణ కల్పించటం పెద్ద పరీక్ష లాంటిది. అయితే గత 25 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బాడీగార్డ్ గా ఉంటూ సల్మాన్‌కు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. షేరా అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా సల్మాన్‌కు బాడీగార్డ్ గా ఉంటూ అత్యంత నమ్మకస్థుడిగా పేరొందాడు . అయితే సల్మాన్ ఖాన్ కి బాడీగార్డ్ గా ఉండటం వల్ల అతను అందుకునే జీతం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్‌ఖాన్‌కి బాడీగార్డ్‌గా ఉండటం వల్ల షేరా అందుకునే జీతం నెలకు దాదాపు రూ. 15 లక్షలు . అంతే కాకుండా అతడు టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్ స్టాపించి ప్రజంట్ దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సెక్యూరిటీ సంస్థ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోని హై-ప్రొఫైల్ సెలబ్రిటీలకు భద్రతను అందిస్తున్నాడు. షేరా ఇలా బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులకు భద్రతా సేవలను అందించడం ద్వారా భారీ ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.

Salman Khan: సెలబ్రిటీగా మారిన సల్మాన్ బాడీ గార్డ్…

ఇలా సల్మాన్ ఖాన్ కి గత 25 సంవత్సరాలుగా బాడీగార్డ్ గా పనిచేయటమే కాకుండా సెక్యూరిటీ సంస్థ ద్వారా కూడా షేరా ఆర్థికంగా బాగా ఎదిగాడు. షేరా మొత్తం ఆస్తుల విలువ సుమారు 100 కోట్లుగా ఉన్నట్లు అంచనా. దీంతో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం, ఆస్తుల విలువ తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు షేరా ఒక సెలబ్రిటీగా మారాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

3 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

4 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

4 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

6 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

6 hours ago