Shaakuntalam: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఆయన ఆ సినిమా హిట్టు అవటంతో సినిమా పేరు తన పేరుగా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాతగా రాణిస్తున్న దిల్ రాజు ఎన్నో జయాపజయాలు చూసాడు.
దిల్ రాజు నిర్మించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించి దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలి దిల్ రాజు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమా విషయంలో కూడా దిల్ రాజుకి నిరాశ మిగిలింది. సమంత కీలక పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం సినిమా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై అందరినీ నిరాశ పరిచింది.
ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు శాకుంతలం సినిమా డిజాస్టర్ గురించి స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ ఇంటర్వ్యు లో శాకుంతలం డిజాస్టర్ గురించి స్పందించిన దిల్ రాజు.. ‘తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం సినిమా పెద్ద జర్క్ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సినిమా వల్ల తాను పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు దిల్ రాజు తెలిపాడు.మొత్తానికి శాకుంతలం సినిమా అటు సమంత ఇటు దిల్ రాజు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. గుణశేఖర్ తన కుమార్తె నీలిమతో కలసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు.అయితే దిల్ రాజు ఈ సినిమాని విడుదల చేశాడు. దీనితో దిల్ రాజుకు కూడా శాకుంతలం వల్ల భారీ నష్టం మిగిలింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…