Salman Khan: పాము కాటుకు గురైన సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఎలా ఉందంటే..!
Salman Khan: తన పుట్టినరోజుకు ముందు.. సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌కి బయలుదేరాడు. అక్కడ అతను విషం లేని పాము కాటుకు గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నటుడిని చికిత్స కోసం కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను ఈ రోజు ఉదయం 9 గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు.
సల్మాన్‌ఖాన్ చేతికి పాము కరిచింది.. అయితే అతడి ఆరోగ్య పరిస్థతి బాగానే ఉన్నట్లు తెలిపారు. అతనికి యాంటీ-వెనమ్ మెడిసిన్ ఇవ్వబడిందని.. కొన్ని గంటలు అతడిని అబ్జర్వేషన్లో ఉంచి.. తర్వాత తనను ఇంటికి తీసుకెళ్లమని చెప్పినట్లు వైద్యులు తెలిపారు. మొత్తానికి తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా బయట పడడంతో సల్లూ భాయ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇక అతడి పుట్టిన రోజును ప్రతీ సంవత్సరం తన విలాసవంతమైన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో జరుపుకోవడం అతడి సంప్రదాయం. గత సంవత్సరం లాక్‌డౌన్‌లో ఎక్కువ భాగం సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ శర్మ పేరు మీద ఉన్న తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. నటుడు అతను పొలంలో పని చేస్తున్న.. విత్తనాలు విత్తుతున్న అనేక చిత్రాలు, వీడియోలను పంచుకున్నాడు.
డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలు, పుట్టినరోజు జరుపుకునేందుకు సల్మాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ఈ ప్రాంతం చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉంది. దీని కారణంగానే అతడు పాము కాటుకు గురయ్యాడు.
ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 15’ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయంతో ఆయన చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘నాటు నాటు’ సాంగ్ కు చరణ్, తారక్ ల దగ్గర స్టెప్ నేర్చుకుని మరీ వేశాడు సల్మాన్. వాళ్లతో కలిసి అడ్వాన్స్ గా అతడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…