Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ చేసేందుకు తొలగిన అడ్డంకులు..!
Telangana Farmers: తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులు పంట పెట్టుబడికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో 2018, ఏప్రిల్ నుంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సాగు పనులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రైతుబంధు ఇప్పటికీ కొనసాగుతోంది.
సంవత్సరంలో రెండు సార్లు ప్రస్తుతం ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. మొదట ఎకరాకు రూ.8వేల చొప్పున ఇచ్చిన కేసీఆర్ సర్కార్.. ఆ పెట్టుబడి సాయాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచి.. రూ.5 వేల చొప్పున రెండు సీజన్లలో రూ.10 వేలకు పెంచాడు.
ఇక ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య ఏడాదిఏడాదికి పెరుగుతూ వస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,236.30 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 60.84 లక్షలకు చేరింది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను రూ.7,360.41 కోట్లు రైతుబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్ నిధులను డిసెంబర్ 28న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు ఈ నెల 28 నుంచి రైతులకు అందనుంది.
మొదట ఈ నిధులు సరిగ్గా సర్దుబాటు కాకపోవడంతో డిసెంబర్ 15న రావాల్సిన ఈ రైతుబంధు డబ్బులు ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ నిధులు జమ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని.. సీఎం కెసిఆర్ ఆదేశాలతో మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రూ. 7,500 కోట్లు యాసంగి పంట కోసం రైతు బంధు సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. మొదట ఎకరాలోపు భూమి ఉన్నవాళ్లకు.. తర్వాత ఎకరా నుంచి రెండకరాల మధ్య భూమి ఉన్నవారికి ఈ రైతుబంధు నిధులు జమ కానున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…