సినీ పరిశ్రమలో తన అభిమాన హీరో, హీరోయిన్లకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసుకోవాలన్న ఆత్రుత ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. బాలీవుడ్ లో అయితే సినిమా వాళ్లకు రెమ్యూనరేషన్ లు ఎక్కువగానే ఉంటాయి. ఒక్కో సినిమాకు దాదాపు కొన్ని కోట్లలలోనే తీసుకుంటారు. ప్రస్తుతం ఇలా తీసుకుంటున్న నటీనటులు కెరీర్ మొదట్లో సినిమాల్లో ఫ్రీగా చేసినవాళ్లు చాలా మంది ఉన్నారు.
మెగస్టార్ చిరంజీవి కూడా మొదట్లో ఫ్రీగానే సినిమాల్లో నటించాల్సి వచ్చిందట. చిరంజీవి మాత్రమే కాదు బాలీవుడ్ బాద్ షా బిగ్ బీ కూడా ఇలానే చేశారట. ఇక బాలీవుడ్ లో కండల వీరుడిగా పేరపొందిన సల్లుభాయ్ (సల్మాన్ ఖాన్), షారుక్ ఖాన్ లాంటి వారు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సంచలనం స్ఫష్టిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో బాహుబలి తర్వాత ప్రభాస్ కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరగా.. కోలివుడ్ స్టార్ విజయ్ కూడా తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. భారత సినీ పరిశ్రమలో మొదట రూ.100 కోట్లు తీసుకున్న మొదటి హీరోగా సల్మాన్ ఖాన్ చరిత్ర స్పష్టించారు. అయితే సల్లు భాయ్ మొదట్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మొదట సల్మాన్ ఖాన్ 1988 లో బివి హో తో ఐసీ అనే సినిమాతో తన నటనను ప్రారంభించాడు . అతను ఇందులో సహాయక పాత్రను పోషించాడు.
ఈ సినిమా పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు అతడు కేవలం రూ.11 వేలు మాత్రమే పారితోషికం తీసుకున్నాడట. తర్వాత అతను సూరజ్ ఆర్. బార్జత్య యొక్క రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 1989లో ‘మైనే ప్యార్ కియా’లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అతడి మొదటి సినిమా… పారితోషికం ఎంత అనే వార్త తెగ వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…