“మనం” సినిమాలో అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో “మనం” ఎంతటి ప్రభంజనం సృష్టించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ తరువాత కూడా అక్కినేని కుటుంబం కలిసినటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోకుండా నటిస్తుంటారు. వీరు కలిసి ఒకే సినిమాలో నటిస్తుంటే అక్కినేని అభిమానులకు పండగే… తాజాగా మరోసారి అభిమానులకు పండగ చేయనున్నట్టు సమాచారం. తాజాగా “మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచులర్” తో అక్కినేని అఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని నటించనుందట. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజ హెగ్డే అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయిపోయింది. కరోనా కారణంగా ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రంలో సమంత అక్కినేని గెస్ట్ రోల్ లో నటించనుందని వార్తలు ఫిలింనగర్ లో హోరెత్తాయి.
ఇదివరకే మావయ్య నాగార్జున సినిమా మన్మధుడు -2 లో అతిధి పాత్ర చేసిన సమంత. ఇప్పుడు మరిది అఖిల్ సినిమాలో అతిధి పాత్రలో నటించనుదట. బొమ్మరిల్లు సినిమాలో కథ మొత్తం ఒక లేడీ స్కూటర్ మీద వెళుతూ సిద్దర్ చెబుతుంటాడు. ఈ సినిమాలో కూడా అటువంటి పాత్రలో సమంత నటించనుందట. సమంత కోసమే స్పెషల్ గా ఈ పాత్ర డిజైన్ చేసాడట బొమ్మరిల్లు భాస్కర్. చూడాలి మరి ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్ళు గడచినా హిట్టు అందుకోలేక సతమతమవుతున్న అఖిల్ కి… వదిన సమంత రూపంలోనైనా హిట్ వస్తుందేమో..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…