Samantha: సాధారణంగా హీరో హీరోయిన్ల మీద ప్రేక్షకులకు అమితమైన అభిమానం ఉంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల మీద ఉన్న వారి అభిమానాన్ని వివిధ రకాలుగా తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానంతో హీరో హీరోయిన్లకు గుడి కట్టించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అందాలతో ఆకట్టుకొనే హీరోయిన్లకు అభిమానులు ఎక్కువ.
కోలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టించారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ తో పాటు హన్సిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ల కే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా అభిమానులు గుడి కట్టించారు.ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంతకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఒక అభిమాని సమంత మీద తనకి ఉన్న అభిమానాన్ని చాటుకోవటానికి ఏకంగా ఆమెకు గుడి కట్టించాడు.
తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా సమంతకి గుడి కట్టించి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అయితే సమంత గుడి, ఆ గుడిలోని సమంత విగ్రహం మీద ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు గుడి అయితే కట్టారు విగ్రహం కూడా సమంతది పెడితే బాగుంటుంది అని కొందరు, విగ్రహానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని ముందే చెప్పాలిగా అంటూ మరికొందరు ఇలా వివిధ రకాలుగా కౌంటర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక దీని గురించి ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నువ్ సమంత అని చెప్పే వరకు నాకు తెలియలేదు బ్రో అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక బ్రహ్మానందం స్టిల్స్‌ను వాడుకుంటూ ఈ విగ్రహం మీద నానా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత గుడి, విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…