Samantha: ఏం మాయ చేసావు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత తన సినీ కెరియర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ తన నటనతో ఎంతో మందిని సందడి చేసిన సమంత తాజాగా యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా మంచి కలెక్షన్లు రాబడుతుంది.
ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలలోనటించడమే కాకుండా కొన్ని యాక్షన్ సన్నివేశాలలో కూడా ఎంతో అద్భుతమైన నటనను కనపరిచారు.ఇలా సమంత యాక్షన్ సన్నివేశాలలో ఎంతో గొప్పగా నటించడానికి తన జిమ్ ట్రైనర్ కారణమంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె తన జిమ్ ట్రైనర్ గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యారు.
సమంత తన జిమ్ ట్రైనర్ జునైద్ గురించి మాట్లాడుతూ.. నాకు ఎంతో ఇష్టమైన జిలేబి తినడానికి జునైద్ ఎప్పుడు ప్రయత్నించలేదు.యశోద సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ యాక్షన్స్ సన్ని వేషాలను సెలెబ్రేట్ చేసుకోవడానికి స్వయంగా తానే జిలేబి తీసుకువచ్చారు. ఇక కొన్ని నెలలు నా వెంటే ఉంటూ నా కష్టాలు కన్నీళ్లను చూసావు.. ప్రతిసారి నాకు ధైర్యం చెబుతూ వచ్చావు.
యశోద సినిమాలో ఇంత బాగా యాక్షన్స్ సన్ని వేశాలలో నటించాను అంటే అందుకు కారణం నువ్వే నీ వల్లే ఇది సాధ్యమైంది.నీ వల్లే నేను మారాను థాంక్యూ అంటూ ఈమె తన జిమ్ ట్రైనర్ గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత మయూసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూనే ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను, ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
గ్రహాల సంచారం మనిషి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా ప్రేమ, వివాహం, సౌఖ్యం వంటి అంశాలకు…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరొందిన నయనతార – విఘ్నేష్ శివన్ తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంను…
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా…
మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…
పుట్టుమచ్చలు అంటే సాధారణంగా శరీరంపై కనిపించే చిన్న గుర్తులు మాత్రమే అని చాలామంది భావిస్తారు. అయితే భారతీయ సంప్రదాయాల్లో, ముఖ్యంగా…
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలామందిని వేధిస్తున్న…