Samantha: భర్త నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైంది. ప్రతీ రోజు ఏదో ఒక వార్త సమంతకు సంబంధించి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే విడాకుల తర్వాత ఆమె ఎక్కువగా సినిమాలపై శ్రద్ధ వహిస్తూ.. ఫుల్ బిజీ అయ్యారు. పెళ్లికి ముందు ఎలాంటి స్కిన్ షో చేయని సంమత.. మొదటి సారిగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించారు.
ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న సాంగ్ ఏదైనా ఉందంటే.. ‘ఊ అంటావా.. మావా.. ఊఊ అంటావా సాంగ్..’’మాత్రమే. అయితే ఈ పాట తర్వాత ఆమె కొన్ని సినిమాలకు సైన్ చేశారు. శాకుంతలం సినిమా తర్వాత ఆమె తదుపరి ప్రాజెక్ట్ కొరటాల శివ డైరెక్షన్లో చేయనున్నట్లు టాక్.
అయితే తాజాగా ఆమెకు సంబధించి కొన్ని గోవా ఫొటోలు వైరల్ గా మారాయి. గోవా నుంచి సమంత ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె ఈ ఫొటోలో బికినీలో కనిపించింది. ఆమెతో పాటు తన స్నేహితులు డిజైనర్ శిల్పా రెడ్డి మరియు ఇతరులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గోవా విహారయాత్రలో ఉన్నారు. 2022 కొత్త సంవత్సరం వేడుకులకు ఆమె గోవా వెళ్లినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సామ్ నాగ చైతన్యతో కలిసి విదేశాలకు వెళ్తుంది. ఈ సంవత్సరంలోనే వాళ్లిద్దరు విడాకుల ప్రకటన వెలువరించిన నేపథ్యంలో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇక ఈ సారి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోడానికి ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఆమె తన స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ ఫ్లాన్ చేసింది. అక్కడ ఆమె బికినీ ధరించి ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన ఎంతో మంది నెటిజన్లు ఇయర్ ఎండ్ ట్రీట్ మాములుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…