Movie News

ఎన్టీఆర్ షో లో సందడి చేసిన సమంత.. నాగచైతన్య గురించి ఏం చెప్పిందంటే?

గత కొద్ది రోజుల నుంచి సమంత నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వీరి గురించి వచ్చిన వార్తలు నిజమేనని అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఇలా చైతన్య సమంతలు తమ విడాకుల విషయాన్ని ప్రకటించడంతో నెటిజన్లు వీరు విడాకులకు కారణం ఇదేనంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

విడాకుల తర్వాత సమంత నాగచైతన్య బాగా రిలీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి విడాకుల విషయం గురించి పెద్దగా స్పందించకపోవడమే కాకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో బుల్లితెరపై సందడి చేస్తోంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ టీవీలో ప్రసారం కాబోయే మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి అతిథిగా వచ్చారు.

సమంత పాల్గొన్న ఈ కార్యక్రమం వచ్చేవారం ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొన్న సమంత సుమారు పాతిక లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో కలిసి సమంత దాదాపు మూడు సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎంతో సరదాగా ముచ్చటించారు. విడాకులు తీసుకున్న తరువాత మొట్టమొదటిసారిగా బుల్లితెరపై సందడి చేసిన సమంత నాగచైతన్య గురించి ఏ విధమైనటువంటి విషయాలు తెలియజేసిందనే విషయం తెలియాలంటే మనం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి, సమంత కలిసి మరొక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మరి కొన్ని కథలను వింటున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago