సినీతారల మధ్య గాసిప్స్ భలే హైప్ ను క్రియేట్ చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు కానీ కొన్ని కొన్ని గాసిప్స్ తారలకి చిరాకు తెప్పిస్తుంటాయి కూడా.. అలాంటి ఓ గాసిప్ మన ఓ బేబీ కి కోపం రప్పించేలా చేసింది. ఎట్టకేలకు అక్కినేని కోడలు సమంత తనకు పుట్టబోయే బిడ్డపై దృష్టి పెట్టిందంటూ ఓ వెబ్ సైట్ కధనం రాసుకొచ్చింది. అక్కినేని నాగ చైతన్యను సమంత పెళ్లి చేసుకుని రెండేళ్లు అవుతోంది..వీరి పెళ్లైనప్పటి నుంచి అభిమానులే కాదు పలు మీడియా వర్గాలు కూడా పిల్లల గురించి ఎన్నో ప్రశ్నలు గుప్పించాయి. వాటన్నింటికీ చాలాసార్లు ఓపిగ్గా సమాధానం చెప్పారు సమంత.
అయితే ఎప్పుడూ రొటీన్ సమాధానం ఇస్తే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో.. ఈసారి మాత్రం తనదైన శైలిలో చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇంతకీ పిల్లల గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో ప్రస్తుతం సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ షూటింగ్ పుణెలోని బారామతి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఫ్లైట్ ఆలస్యమైంది దాంతో సమంత కాసేపు అభిమానులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి ‘సమంత పిల్లల్ని ఎప్పుడు కంటావ్?’ అని అడిగాడు.
ఈ ప్రశ్నతో విసిగిపోయిన సమంత మొత్తానికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు.
“నేను పిల్లలను కనడం నీకంత అవసరమా.. కనడం.. కనకపోవడం అది నా వ్యక్తిగతం. మీ వ్యూస్.. రేటింగ్ పెంచుకోవడం కోసం మాపై మీ ఇష్టమొచ్చినట్లుగా గాసిప్స్ రాయడం పద్ధతికాదు. మీరు రాసే ఆ గాసిప్స్ ఎఫెక్ట్ మా జీవితాలపై ప్రభావం చూపుతుంది. అయినా మీరడిగారు కాబట్టి ‘నా శరీరంలోని అవయవాల పనితీరు గురించి తెలుసుకోవాలని ఎంతో ఆత్రతుగా ఎదురుచూస్తున్న వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
2022లో నేను బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. డేట్ ఆగస్ట్ 7, సమయం గంటలు. ఇదే నా సమాధానం’ అంటూ చిరాగ్గా సమాధానం ఇచ్చారు. అయితే ఈ చర్చ ఇంతటితో ఆగలేదు. ఆగస్ట్ 7, 7 గంటలకు ఏంటి ప్రత్యేకం? ఆరోజున చై, సామ్ పెళ్లి రోజు కూడా కాదు కదా అంటూ అభిమానులు చర్చలో మునిగిపోయారు. గతంలో సమంత తనకు పుట్టబోయే బిడ్డ గురించి వివరిస్తూ.. ‘నేను ఎప్పుడైతే తల్లిని అవుతానో అప్పుడు ఆ బిడ్డే నాకు ప్రపంచం అవుతుంది. నా బిడ్డ కోసం నేను కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటాను. నేను చిన్నప్పుడు కోల్పోయినవన్నీ నా బిడ్డకు ఇస్తాను.
ఎందుకంటే నా బాల్యం అంత సజావుగా సాగిపోలేదు. కానీ నా బిడ్డ ఆ కష్టాలు పడకూడదు. నేను, చై ఓ డేట్ అనుకుంటున్నాం. అయితే ఆ డేట్ ఎప్పుడన్నది నేను మీకు చెప్పను. ఎందుకంటే చెప్పిన సమయానికి నేను గర్భం దాల్చకపోతే అందరూ చైలో ఏదో లోపం ఉందని అనుకుంటారు’ అని వెల్లడించారు. అదండి విషయం. మొత్తానికి సమంతా నిజంగానే పిల్లలపై దృష్టి పెట్టిందండోయ్..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…